Friday 9 November 2012

గ్యాస్‌ దక్కకుండా చేసింది బాబే

సొంత బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు..అధికారంలోకి రావడం కోసం అడ్డమైన దారులు తొక్కేందుకు కూడా ఆ పెద్దమనిషి వెను కాడడు.. నీచ రాజకీయాలు చేయడంలో బాబూకి సాటెవ్వరూ లేరని  వైఎస్  తనయ షర్మిల చంద్రబాబు పై  విమర్శనాస్త్రాలను సంధించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 21వ రోజు అనంతపురం జిల్లా గుంతకల్లులో కొనసాగింది. పొట్టిశ్రీరాములు సర్కిల్‌లోఅశేష జనవాహిని మధ్య జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. మొన్న వెలుగు చూసిన 2జీ స్పెక్ట్రం స్కామ్‌ కంటే చంద్ర బాబు-రిలయన్సు  కలిసి చేసిన కృష్ణాగోదావరి గ్యాస్‌ బేసిన్‌ స్కామ్‌ అతి పెద్దదని ఆమె ఆరోపించారు. ఆనాడు బాబు  అధికారంలో ఉన్నప్పుడు రియలన్స్‌కి కేజి బేసిన్‌ను కట్టబెట్టి, మనగ్యాస్‌ను మనకు దక్కకుండా చేశాడని ఆమె విమర్శించారు. ఈ ఉదంతాలన్నీ ఆనాడు వెలుగుచూడకుండా ఉండేందుకు ఈనాడు సంస్థలో షేర్లు కొని  రిలయన్సు వేలాది కోట్లు పెట్టుబడి పెట్టిందని షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్ర భవి ష్యత్తును,ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా రిలయన్స్‌కి మేళ్లు చేకూర్చిన చంద్రబాబుకి చట్టాలు వర్తించవా అని ఆమె ప్రశ్నిం చారు. గత నెల 5వ తేదీ జగన్‌కి బెయిల్‌ వచ్చేదని, అంతలోపే చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా చీకట్లో కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి జగన్‌కి బెయిల్‌ రాకుండా కుట్రపన్నారని ఆమె ఆరోపించారు.అన్ని వర్గాల వారిని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇక నూకలు చెల్లాయని షర్మిల చెప్పారు. 
వై సీపీ అధికారంలోకి రాగానే ఆనాడు వైఎస్  కన్న కలలను సాకారం చేస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరిస్తామన్నారు. అన్నదాతల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తో పాటు వారికి 3 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు అన్నివర్గాలు ప్రజలు సుఖసంతోషా లతో ఉండాలన్నా, విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్నా, ముస్లీం మైనార్టీలు అన్ని రంగాల్లో అభి వృద్ది సాధించాలన్న రాజన్న రాజ్యం తిరిగి రావాలన్నారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...