Saturday 17 November 2012

వైఎస్ ను దోషిగా నిలబెట్టే యత్నం చేసారు

"రాజశేఖరరెడ్డి ఏ పథకం తెచ్చినా ఇందిరాగాంధీ అని, రాజీవ్ గాంధీ అని వాళ్ల పేర్లే పెట్టాడు. అందుకు బహుమానంగా ఆయన పేరును దోషిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇది అన్యాయం కాదా? ఇది వెన్నుపోటు కాదా" అని అడుగుతున్నా.ఎమ్మిగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తూ  కాంగ్రెస్  పై  నిప్పులు చెరిగారు.
రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి.. మీ గుండెల్లో ఆయనను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క రాజన్న కుటుంబాన్నే కాదు.. రాష్ట్ర ప్రజలందరి మీదా కక్షగట్టి హింసిస్తోంది. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనే లేదు..’’ అని షర్మిల విమర్శించారు.చంద్రబాబు హయాంలో వందల మంది చేనేత కార్మికులు, 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు రాజన్న వారి కుటుంబాలకు సాయం చేయాలని చంద్రబాబును అడిగితే పైసా కూడా సాయం చేయలేదు. రాజన్న అధికారంలోకి వచ్చాక వారికి లక్షన్నర చొప్పున నష్ట పరిహారం ఇచ్చాడు. చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలాడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి అదే గ్రామాల మీదుగా వెళుతూ ఇప్పుడు సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. నా మాట నమ్మాలంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చోళ్లు అంతకన్నా కాదు’’ అన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టినట్టు నటిస్తూనే మిత్రపక్షంగా ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు పెంచిపోషిస్తున్నారు..’’ అని షర్మిల మండిపడ్డారు.

Friday 16 November 2012

షర్మిల పాదయాత్రకి 30 రోజులు

మరో  ప్రజా ప్రస్థానం మొదలై నేటికి 30 రోజులు. ఈ 30 రోజుల్లో షర్మిల దాదాపు15 బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనేక రచ్చబండలు నిర్వహించారు. చెట్ల కింద నుంచోని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాన, ఎండ, చలిలోనూ పాదయాత్ర ఆపలేదు. జ్వరంలోనూ ముందుకు కదిలారు. కుమ్మక్కు కుట్రలపై విరుచుకుపడ్డారు. నీచ రాజకీయాలను కడిగిపారేశారు. అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర  డ్రామాలేంటీ అంటూ ప్రశ్నించారు. 30 రోజుల్లో 375.3 కిలో మీటర్లు నడిచారు షర్మిల.
కుమ్మక్కు కుట్రలకు నిరసనగా, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. వైఎస్‌ కుటుంబాన్ని నిలబెట్టుకుంటేనే తమ బతుకులు నిలబడేదంటూ షర్మిల అడుగులో అడుగేశారు. వైఎస్ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఆరు రోజుల తర్వాత అనంతపురం జిల్లాలోని  ధర్మవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. అనంతపురం జిల్లాలో 17 రోజుల పాటు సాగిన పాదయాత్ర రాప్తాడు, ఉరవకొండ,  గుంతకల్ నియోజకవర్గాల్లో 195 కిలో మీటర్లు పాటు సాగింది. నవంబర్‌ 8న కర్నూలు జిల్లాలోకి మరో ప్రజా ప్రస్థానం అడుగు పెట్టింది.  మద్దెకెర నుంచి  కర్నూలు జిల్లాలో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయంల మీదుగా  ముందుకు కదులుతోంది. ఈ 30 రోజుల పాదయాత్రలో షర్మిల అనేక సమస్యలను తెలుసుకున్నారు . రైతులకు ధైర్యం చెప్పారు. తెలంగాణలో కూడా మరో  ప్రజా ప్రస్థానానికి అదిరిపోయే స్పందన వస్తుందని నేతలు ఆ ప్రాంత నేతలు చెప్పారు.  పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు  వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన కోసం ఆ  ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు

22 నుంచి తెలంగాణలో షర్మిల యాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ 22న మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభమవుతుంది. అలంపూర్ నియోజకవర్గం పుల్లూరులో తెలంగాణలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. పాదయాత్రను విజయవంతం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 14 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమించారు. షర్మిల జిల్లాలోకి ప్రవేశించినప్పుడు లక్షమందితో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మహబూబ్‌నగర్ తర్వాత రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ హయాంలో మొదలై, ప్రస్తుతం ఆగిపోయిన ప్రాజెక్టులను షర్మిల సందర్శిస్తారు. మొత్తం ఏడు నియోజకవర్గాల మీదుగా జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని తెలంగాణ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు.

"గ్యాస్" భారం మోపి పిల్లల కడుపు కొడుతున్నారు

"గ్యాస్ మీద భారం మోపి ఈ ప్రభుత్వం పిల్లల కడుపుమీద కొడుతోంది....హాస్టల్లో నెలకు 18 చొప్పున ఏడాదికి 216 సిలిండర్లు దాకా వాడాల్సిన అవసరముంటే.. వాటిలో ఆరు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తుందట. మిగిలినవి ఒక్కో సిలిండరూ రూ.1,250 పెట్టి కొనుక్కోవాలట. ఎంత అన్యాయమిది? అసలే పిల్లలకు రోజుకు రూ.17 మాత్రమే భోజనానికి వెచ్చిస్తుంటే.. ఇప్పుడు గ్యాస్ పేరుతో ఆ భోజనంలో కూడా కోత పెట్టే పరిస్థితి. రూ. 17తో అసలు పిల్లలకు రెండు పూటలా భోజనం ఎలా సరిపోతుంది? జైల్లో ఖైదీలకు కూడా రూ. 45 వెచ్చిస్తుంటే.. పిల్లలకు రూ. 17 మాత్రమేనా? ఇది అన్యాయం కాదా? అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికి ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయో కనుక్కోవాలి..’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల మండిపడ్డారు. ప్రజల శ్రేయస్సును గాలికి వదిలేసి కుమ్మక్కైన కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలకు నిరసనగా జగన్‌ తరఫున షర్మిల  చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 29వ రోజు గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో సాగింది. పెద్దకడబూరు దాటాక క స్తూర్బా బాలికల విద్యాలయంలో షర్మిల విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు ఉండడం లేదని, కాంపౌండ్ వాల్ లేదని, ప్లేగ్రౌండ్ లేదని, గ్యాస్ ధర పెరిగిందంటూ మెనూలో కోతపెడుతున్నారంటూ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన షర్మిల గ్యాస్ పేరుతో పిల్లల పొట్ట మీద కొట్టడం అమానవీయమని అన్నారు. పాలు, గుడ్లు, అల్పాహారం అందుతున్నాయా? అని అడగడంతో పాలు ఇవ్వరని, గుడ్లు వారానికి మూడు ఇస్తారని విద్యార్థినులు తెలిపారు. పదో తరగతితో ఆపకుండా పెద్ద చదువులు చదవాలని, జగనన్న సీఎం అయ్యాక ఎంత పెద్ద చదువైనా ఉచితంగా చదివిస్తాడని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కలెక్టర్‌తో మాట్లాడి క్రీడామైదానం వచ్చేలా చూస్తారని షర్మిల హామీ ఇచ్చారు.గురువారం యాత్రలో ఉదయం రంగాపురం శివారులో బయలుదేరిన షర్మిలకు మంత్రాలయం నియోజకవర్గ ప్రజానీకం అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.

Thursday 15 November 2012

కాంగ్రెస్, టీడీపీ ఒక్కటే

‘‘మాలాంటి వారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకోవడంలో అర్థం ఉంది. కానీ చంద్రబాబుకు పాదయాత్ర ఎందుకు? ఆయనకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయొచ్చు.. కానీ దించేయరట."ఆదోని పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభ లో షర్మిల మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకుంది.  ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ సర్కార్ ను  కూలదోయడం చాలా సులభం. ప్రతిరోజూ అడుగుతూనే ఉన్నాం.. నిలదీస్తూనే ఉన్నాం.కానీ టీడీపీ అవిశ్వాసం పెట్టదట! పేరుకు మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయడం లేదంటూ చంద్రబాబు తిడుతూనే అదే ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారారు..  ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయని ధ్వజమెత్తారు. కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదన్న మాట నిజమే అయితే.. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టి తన నిజాయతీని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని.. ఆయనకు తెలిసిందల్లా అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు రాజకీయాలు చేయడమేనని ఎద్దేవా చేశారు.

Wednesday 14 November 2012

ఈ సర్కార్ పేదోళ్ల బతుకుల్లో చీకటి నింపుతోంది


‘‘ఇచ్చే నాలుగు గంటల కరెంటుకు రూ.250 బిల్లు వేస్తున్నారట! మూడేళ్లలో మూడుసార్లు చార్జీలు పెంచిన ఈ ప్రభుత్వం.. మూడేళ్ల కిందటి సర్‌చార్జీలు ఇప్పుడు వసూలు చేస్తూ పేదోళ్ల బతుకుల్లో చీకటి నింపుతోంది. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు విద్యుత్తు కోతల్లేకుండా కరెంటు బిల్లు రూ.50 వస్తే.. ఇప్పుడు మొత్తం కోతలతోనే రూ.250 రావడం ఏ రకంగా న్యాయం. ఇది రాబందుల రాజ్యం కాదా..?’’ అంటూ  జగన్‌ చెల్లెలు షర్మిల రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. బస్ చార్జీలు, కరెంటు చార్జీలు, గ్యాస్ చార్జీలు ఎడాపెడా పెంచేసి ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు అవసరాలను ముందే ఊహించి కొనుగోలు చేసేవారని, ఈ ముఖ్యమంత్రి మాత్రం నిద్రపోతున్నారన్నారు.

సుమలతకు అండగా

కర్నూలు జిల్లా బిణిగేరకు చెందిన సుమలత అనే పదేళ్ల చిన్నారి వాళ్ల నాయనమ్మతో కలిసి షర్మిలను చూసేందుకు వచ్చింది. స్కూలుకు వెళ్తున్నావా చిన్నా అని షర్మిల అడగగా  ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. ఐదో తరగతి వరకు చదువుకున్నానని, ఈ ఏడాదే చదువు మానేశానని, తల్లిదండ్రులిద్దరూ బండలు కొట్టే పనిచేస్తారని, తనను చదివించలేరని ఏడ్చింది. దీంతో చలించిపోయిన   షర్మిల... పాప, నాయనమ్మల కన్నీళ్లు తుడుస్తూ "నేను చదివిస్తానమ్మా" అంటూ ఓదార్చారు. ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మనూరు జయరాం ఆ పాపను చదివించేందుకు ముందుకొచ్చారు. పాపను స్కూల్‌లో చేర్పిస్తానని మాటిచ్చారు.

Monday 12 November 2012

చిన్నారులకు షర్మిల భరోసా !

‘‘ఫ్యాక్షన్ గొడవల్లో మా నాన్నను చంపేశారు. మా అమ్మ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఇల్లు గడవక మా అమ్మ మమ్ములను స్కూలు మాన్పించింది. మేం ఏ గ్రేడ్ స్టూడెంట్లం. మాకు చదువుకోవాలని ఉంది..’’ అంటూ ఇద్దరు చిన్నారులు ఏడుస్తూ చెప్పడంతో షర్మిల చలించిపోయారు. వెంటనే పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని ‘‘ఏడ్చొద్దు తల్లీ! మీ ఇద్దరినీ చదివించే బాధ్యత నాది.. మీ చదువు పూర్తయ్యే వరకు నేను చూసుకుంటా’’ అని వారికి హామీ ఇచ్చారు. పత్తికొండలో షర్మిల బస చేసిన క్యాంప్ వద్దకు  పదేళ్ల రాశి, ఆ పాప తమ్ముడు సురేంద్ర వచ్చారు. షర్మిలక్కను కలవాలంటూ సెక్యూరిటీ వారికి చెప్పి అక్కడే కూర్చున్నారు. అది చూసిన పుట్టపర్తి నియోజకవర్గం పార్టీ నేత డాక్టర్ హరికృష్ణ వారిద్దరిని షర్మిల వద్దకు తీసుకెళ్లారు. షర్మిలను చూడగానే పిల్లలిద్దరు వెక్కివెక్కి ఏడుస్తూ తమ పరిస్థితిని వివరించారు. తండ్రి హనుమంతు హత్యకు గురైతే తల్లి అనసూయ ఓ ప్రైవేటు క్లినిక్‌లో పనిచేస్తూ నెలకు రూ.2,500 సంపాదిస్తుందని, దీంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని పాప రాశి ఏడుస్తూ వివరించింది. దీంతో పాఠశాల చదువు అయిపోయేంత వరకు చదివించే బాధ్యత తనదేనని షర్మిల హామీ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పత్తికొండ నియోజకవర్గం నాయకులు నాగరత్నమ్మ, రామచంద్రారెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గం నాయకుడు హరికృష్ణ ఆ పిల్లల బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. ‘‘మాట ఇచ్చాను. తప్పొద్దన్నా’’ అంటూ షర్మిల ఆ పిల్లలను వారికి అప్పగించారు. నాగరత్నమ్మ పాప రాశిని కస్తూరిబా పాఠశాలలో చేర్పించే ఏర్పాటు చేయగా, డాక్టర్ హరికృష్ణ బాబు పాఠశాలకు నెలనెలా ఫీజు చెల్లించేందుకు హామీ ఇచ్చారు.

Sunday 11 November 2012

బాబు మాటలు టీ డీ పీ ఎమ్మెల్యేలే నమ్మట్లేదు


టీడీపీ అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన మాటలను ఆయన పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదని షర్మిల విమర్శించారు. శనివారం సాయంత్రం 5.10కి పత్తికొండ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న షర్మిల అక్కడికి భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘మేం గర్వంగా చెప్పగలుగుతాం. రాజన్న రాజ్యం మళ్లీ తెస్తామని. కానీ చంద్రబాబు  చేసింది చెప్పుకోలేకపోతున్నారు. పైగా రాజశేఖరరెడ్డిలా అన్ని పథకాలూ అమలు చేస్తానని చెప్పకనే చెబుతున్నారు. కానీ ఆయన మాటలను ఆ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదు. అందుకే వాళ్లు మా పార్టీలోకి వస్తున్నారు. చంద్రబాబుకు పాదయాత్ర అవసరమే లేదు. అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేందుకు ఆయనకు ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆయన పెట్టరు. ఎందుకు పెట్టరో చెప్పరు’’ అని విమర్శించారు. ‘ రెండెకరాల చంద్రబాబు ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారని కమ్యూనిస్టులు పుస్తకం ప్రచురించినా.. దానిపై విచారణ ఉండదు. అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని తెహల్కా వెబ్‌సైట్ ప్రచురించినా.. విచారించరు. ఎకరా రూ. 2 కోట్ల విలువ చేసే భూములను ఎకరా రూ. 50 వేలకే తన బినామీ సంస్థ అయిన ఐఎంజీకి కట్టబెట్టినా.. ఆయన్ను విచారించరు. ఎందుకు విచారణ చేయరని మనం కేసు వేస్తే కోర్టులో జడ్జి గారు కూడా ఎందుకు చేయరని సీబీఐని ప్రశ్నించారు. కానీ సీబీఐ సిబ్బంది లేరని చెప్పింది. జగనన్న మీద, ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్ల మీద దాడులు జరపడానికి సిబ్బంది ఉంటారు. కేవలం ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికే 2 వేల మంది సిబ్బందిని పెట్టారు. కానీ చంద్రబాబుపై విచారణ చేయడానికి వాళ్లకు సిబ్బంది ఉండరు.’’ అని ఆమె దుయ్యబట్టారు.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...