వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు ఏ ప్రాంతానికి ఎంత విద్యుత్తు
అవసరమో, ఏ జల విద్యుత్తు ప్రాజెక్టు నుంచి, ఏ కాలంలో ఎంత విద్యుత్తు
ఉత్పత్తి అవుతుందో, ఇంకా ఎంత అవసరమవుతుందో వేళ్ల మీద లెక్క వేసి
చెప్పేవారని షర్మిల గుర్తుచేశారు. అలంపూర్ నియోజకవర్గంలోజరిగిన పాదయాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఇప్పటి పాలకులకు అసలు ఏ ప్రాజెక్టు ఎక్కడ
ఉందో కూడా తెలియదని ఘాటుగా విమర్శించారు. ‘‘వైఎస్సార్ బతికున్నప్పుడు
తుంగభద్ర నది నుంచి ఆర్‌డీఎస్(రాజోలి డైవర్షన్ స్కీం)కు నీళ్లు వచ్చేవి. జల
సమస్య ఉంటే నాన్నకర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వారిపై ఒత్తిడి తెచ్చి
అవసరమైతే పోలీసు బలగాలను పెట్టి రాజోలి బండకు నీళ్లు తెచ్చేవారు.
వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టించుకునే
వాళ్లే కరువవడంతో ఈ ప్రాంత పంటలకు నీళ్లు రాకుండా పోయాయి’’ అని షర్మిల
ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం
పెట్టకుండా ఇంకా ఎంతకాలం సాగదీస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ను
ఆమె ప్రశ్నించారు.
Saturday, 24 November 2012
Friday, 23 November 2012
ప్రాణ త్యాగాలు వద్దు .....షర్మిల
Wednesday, 21 November 2012
షర్మిల వెంట వైఎస్ అభిమానులు
షర్మిల తనతోపాటు ఇడుపులపాయ నుంచి కాలినడకన వస్తున్న వారి అభిప్రాయాలు
తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని నాగులాపురం వద్ద
చెట్టుకింద రాళ్లపై కూర్చొని తనతో ఎందుకు రావాలనిపించిందో వారిని అడిగి
తెలుసుకున్నారు. వీరితోపాటు అనేక మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన ప్రమీల అనే మహిళ వైఎస్ సీఎం అయిన తర్వాత
సొంతిల్లు కట్టుకున్నారు. రూ.60 వేల రుణం మాఫీ అయింది. దీంతో ఇప్పుడు తన
కొడుకుతో కలిసి పాదయాత్ర చేస్తోంది. ప్రకాశం జిల్లా గురువారెడ్డి పాలెంకు
చెందిన 55 ఏళ్ల రమణమ్మ రాజన్నపై అభిమానంతో మరో ఏడుగురు తన ఊరి వాళ్లను
తీసుకొచ్చి మరీ పాదయాత్రలో ఇడుపుల పాయ నుంచి నడిచి వస్తున్నారు.
ఇక ప్రకాశం జిల్లాకు చెందిన చెన్ను విజయ అనే గృహిణి తన కుమారుడిని రెసిడె న్షియల్ స్కూల్‌లో చేర్పించి షర్మిలతో పాదయాత్ర చేస్తుంటే.. వైజాగ్‌కు చెందిన పేరిచర్ల ఝాన్సీ జగన్ కుటుంబంపై అభిమానంతో ప్రతి జిల్లాలో రెండ్రోజులు షర్మిల వెంట నడుస్తున్నారు. జగన్ మీద అభిమానం పెంచుకున్నందుకు మహిళా గ్రూపు నుంచి తన తల్లిపేరు తీసివేయడంతో అక్కతో కలిసి నడవాలని వచ్చినట్లు రాఘవేంద్ర అనే యువకుడు చెప్పాడు. ఇలాగే గుంటూరుకు చెందిన చింతా సుబ్బారెడ్డి, కోడూరు వాసి కృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వాసి జ్యోతుల నవీన్ ఆయన స్నేహితులు, కృష్ణా జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి, కడప నుంచి రాజగోపాల రెడ్డి, మాచ్చవరానికి చెందిన గజ్జెల వెంకట కృష్ణారెడ్డి, అనంతపురానికి చెందిన వన్నూరమ్మ, కడప నుంచి షఫీ, ధర్మవరం నుంచి నారాయణ, కోడుమూరు నుంచి శ్రీనివాస యాదవ్, కడప నుంచి సరస్వతి... ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా వైఎస్ కుటుంబానికి అభిమానులుగా మారారు. అదే అభిమానంతో జగన్‌ను సీఎంగా చూడాలన్న లక్ష్యంతో అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేసుకుంటూ కర్నూలుకు వచ్చారు. షర్మిలతో కలిసి ఇచ్ఛాపురం వరకు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తామని చెబుతున్నారు.

రేపు మహబూబ్‌నగర్ జిల్లాలోకి షర్మిల యాత్ర
జగన్ సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం(ఈ నెల 22వ తేదీ)
మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. మధ్యాహ్నం 1 గంటకు తుంగభద్ర
బ్రిడ్జి వద్ద షర్మిల మహబూబ్‌నగర్‌లో అడుగుపెడతారని జిల్లా పార్టీ కన్వీనర్
ఎడ్మ కృష్ణారెడ్డి, సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి, పాదయాత్ర సమన్వయ
కమిటీ సభ్యుడు తలశిల రఘురామ్ లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా
ప్రజలు షర్మిలకు ఘనస్వాగతం పలకడానికి సంసిద్ధులవుతున్నారని చెప్పారు.
జిల్లాలో ఏడు జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 225 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర
కొనసాగుతుందని పేర్కొన్నారు.
Tuesday, 20 November 2012
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచింది ఎవరు బాబూ??
‘‘ చంద్రబాబు గారూ .. మీ కుమ్మక్కు రాజకీయాలు చూడలేక, మీ మీద నమ్మకం
లేకనే మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు. వాళ్లకు
మనస్సాక్షి ఉంది కాబట్టే.. నిజాయతీ పక్షాన నిలబడాలనుకున్నారు. అందుకే..
జగనన్నకు అండగా నిలబడుతున్నారు. జీవితంలో ఏనాడూ నిజం మాట్లాడలేని మీరు ఈ
నిజాన్ని దాచిపెట్టి మేం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నామని అబద్ధపు
ప్రచారం చేస్తున్నారు." అని షర్మిల అన్నారు . ‘మరో
ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 33వ రోజు సోమవారం కర్నూలు జిల్లా కోడుమూరు
నియోజకవర్గంలో సాగింది. జగన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ
కేసులు బనాయించి జైల్లో పెట్టినందుకు నిరసనగా గూడూరులో వేలాది మంది ప్రజలు
నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిల పాదయాత్రలో కదంతొక్కారు. గూడురు సభలో ఆమె
ప్రసంగిస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని చంద్రబాబు ఆదివారం
చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
" మాకు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అనుభవం.. రహస్య ఒప్పందాలు చేసుకునే చరిత్ర మీకే ఉంది., పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను హోటల్‌లో బంధించావు. కొందరిని బెదిరించావు, కొందరిని కొన్నావు. ఇదేనా మీ పరిపాలనా దక్షత?’’ అని షర్మిల బాబుపై నిప్పులు చెరిగారు.

Monday, 19 November 2012
సీఎం కిరణ్ కి సంస్కారం లేకపోవడం దురదృష్టకరం

Sunday, 18 November 2012
బాబు గారూ! మీరు ప్రజల పక్షమో కాదో తేల్చుకోండి
‘‘బాబు గారూ! ఇదిగో.. ఈ ప్రజల మాటలు, వాళ్ల గోడు మీకు వినిపిస్తోందా? ప్రజలకు ఏమీ చేయలేని ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ పాదయాత్రలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీలో విశ్వసనీయత అనేది ఉంటే వెంటనే అవిశ్వాసం పెట్టండి. కానీ మీరేమో అవిశ్వా సం పెట్టనుగాక పెట్టను అంటారు. కాబట్టి మేమే అవిశ్వాసం పెడతాం.. దానికి మీరు మద్దతు ఇస్తారా? సూటిగా చెప్పండి. మీరు ప్రజల పక్షం ఉంటారో..ప్రభుత్వం పక్షం ఉంటారో తేల్చుకోండి’’ అని జగన్ సోదరి షర్మిల.. టీడీపీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు.
ప్రజల కష్టాలు పట్టించుకోని సర్కార్ , దానికి వెన్నుదన్నుగా నిలిచిన టీడీపీ వైఖరులకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 31వ రోజు శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. తిమ్మాపురం గ్రామంలో షర్మిల రచ్చబండ మీద మహిళలతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ‘అమ్మా.. బోరులో నీళ్లు తోడుకొని తాగుదామన్నా కరెంటు ఉండటం లేదు.. తాగే నీళ్లకు కూడా ఇబ్బంది ఉంది. వానలు లేక పంటలు ఎండిపోయినయ్.. నష్ట పరిహారం ఇస్తామన్నారు కానీ ఇంత వరకు లేదు. జ్వరం వస్తే పస్తులు పడుకుంటున్నాం.. మొన్ననే చంద్రబాబు గారి పాదయాత్ర మా ఊరి నుంచే పోయింది. ఆయనకూ మా బాధలు చెప్పినం. ఇది పనికిరాని ప్రభుత్వం.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించితే మీకు మేలు జరుగుతుంది అన్నారు.. బాబుగారు తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని టీవీల్లో చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని బాబుగారు కూలగొట్టడం లేదమ్మా’’ అని ఇదే గ్రామానికి చెందిన వెన్నెల మహిళా గ్రూపు సభ్యులు తోడేళ్ల రామలింగమ్మ, నర్సమ్మ షర్మిలను అడగటంతో షర్మిల పై విధంగా స్పందించారు.
"చంద్రకళ" కు మళ్లీ చదువుకళ..
ఇంటర్మీడియెట్ పాసై పేదరికంతో డిగ్రీ చదవలేక కూలీ
పనులకు వెళ్తున్న
బాలికను షర్మిల అక్కున చేర్చుకున్నారు. తిరిగి కాలేజ్‌కు వెళ్లి చదువుకుంటే
ఖర్చులు తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన
విరూపాక్ష గౌడ్ కూతురు చంద్రకళ ఇంటర్మీడియెట్ సీఈసీలో ఉత్తీర్ణత సాధించారు.
పేదరికంతో చదువు మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. పత్తి చేలో పత్తి
తీస్తున్న వారిని షర్మిల పలకరించారు. పేదరికంతో తాను ఉన్నత చదువుకు
దూరమయ్యానని, ఇవ్వాళ వైఎస్సార్ బతికే ఉంటే తాను ధైర్యంగా డిగ్రీ
చదివేదానినని చంద్రకళ చెప్పారు. ఆ బాలిక మాటలకు స్పందించిన షర్మిల చదువు ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు.

Subscribe to:
Posts (Atom)