ఇంటర్మీడియెట్ పాసై పేదరికంతో డిగ్రీ చదవలేక కూలీ
పనులకు వెళ్తున్న
బాలికను షర్మిల అక్కున చేర్చుకున్నారు. తిరిగి కాలేజ్‌కు వెళ్లి చదువుకుంటే
ఖర్చులు తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన
విరూపాక్ష గౌడ్ కూతురు చంద్రకళ ఇంటర్మీడియెట్ సీఈసీలో ఉత్తీర్ణత సాధించారు.
పేదరికంతో చదువు మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. పత్తి చేలో పత్తి
తీస్తున్న వారిని షర్మిల పలకరించారు. పేదరికంతో తాను ఉన్నత చదువుకు
దూరమయ్యానని, ఇవ్వాళ వైఎస్సార్ బతికే ఉంటే తాను ధైర్యంగా డిగ్రీ
చదివేదానినని చంద్రకళ చెప్పారు. ఆ బాలిక మాటలకు స్పందించిన షర్మిల చదువు ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు.

No comments:
Post a Comment