Monday 19 November 2012

సీఎం కిరణ్ కి సంస్కారం లేకపోవడం దురదృష్టకరం

‘ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల స్వప్నాల్లో ఒకటైన హంద్రీ-నీవా ప్రాజెక్టు ఇవాళే ప్రారంభించిన సీఎం కిరణ్‌ అందరి పేర్లూ చెప్పారట.. కాని 4 వేల కోట్లు ఖర్చు చేసి 95 శాతం పనులు పూర్తి చేసిన వైఎస్సార్ పేరు మాత్రం ఒక్కసారంటే.. ఒక్కసారి కూడా ప్రస్తావించలేదట. మంచితనాన్ని గుర్తు పెట్టుకోవడం సంస్కారం. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తికి ఆమాత్రం సంస్కారం లేకపోవడం దురదృష్టకరం. ఆ ప్రాజెక్టు ప్రారంభించినపుడు.. గలగలా నీళ్లు పారినప్పుడైనా వైఎస్ గుర్తురాలేదా మీకు?’’ అని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 32వ రోజు ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో సాగింది. సి.బెళగల్, పొలకల్ గ్రామాల్లో ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. హంద్రీ-నీవాపై మాట్లాడుతున్నప్పుడు షర్మిల తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. గుండెల్లో పెల్లుబుకుతున్న బాధతో ఆమె స్వరం జీరబోయి కొద్దిసేపు మాటలు రాలేదు. భూమా దంపతులు శోభా నాగిరెడ్డి, నాగిరెడ్డి ఆమెను సముదాయించారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...