Saturday 24 November 2012

పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలీదు

 వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు ఏ ప్రాంతానికి ఎంత విద్యుత్తు అవసరమో, ఏ జల విద్యుత్తు ప్రాజెక్టు నుంచి, ఏ కాలంలో ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందో, ఇంకా ఎంత అవసరమవుతుందో వేళ్ల మీద లెక్క వేసి చెప్పేవారని షర్మిల గుర్తుచేశారు. అలంపూర్ నియోజకవర్గంలోజరిగిన  పాదయాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడుతూ  ఇప్పటి పాలకులకు అసలు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదని ఘాటుగా విమర్శించారు. ‘‘వైఎస్సార్ బతికున్నప్పుడు తుంగభద్ర నది నుంచి ఆర్‌డీఎస్(రాజోలి డైవర్షన్ స్కీం)కు నీళ్లు వచ్చేవి. జల సమస్య ఉంటే నాన్నకర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వారిపై ఒత్తిడి తెచ్చి అవసరమైతే పోలీసు బలగాలను పెట్టి రాజోలి బండకు నీళ్లు తెచ్చేవారు. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టించుకునే వాళ్లే కరువవడంతో ఈ ప్రాంత పంటలకు నీళ్లు రాకుండా పోయాయి’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఇంకా ఎంతకాలం సాగదీస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ను ఆమె ప్రశ్నించారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...