రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి.. మీ గుండెల్లో ఆయనను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క రాజన్న కుటుంబాన్నే కాదు.. రాష్ట్ర ప్రజలందరి మీదా కక్షగట్టి హింసిస్తోంది. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనే లేదు..’’ అని షర్మిల విమర్శించారు.చంద్రబాబు హయాంలో వందల మంది చేనేత కార్మికులు, 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు రాజన్న వారి కుటుంబాలకు సాయం చేయాలని చంద్రబాబును అడిగితే పైసా కూడా సాయం చేయలేదు. రాజన్న అధికారంలోకి వచ్చాక వారికి లక్షన్నర చొప్పున నష్ట పరిహారం ఇచ్చాడు. చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలాడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి అదే గ్రామాల మీదుగా వెళుతూ ఇప్పుడు సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. నా మాట నమ్మాలంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చోళ్లు అంతకన్నా కాదు’’ అన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టినట్టు నటిస్తూనే మిత్రపక్షంగా ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు పెంచిపోషిస్తున్నారు..’’ అని షర్మిల మండిపడ్డారు.
Saturday, 17 November 2012
వైఎస్ ను దోషిగా నిలబెట్టే యత్నం చేసారు

Labels:
kurnool
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment