వైఎస్ జగన్ సోదరి షర్మిల
చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కర్నూలు జిల్లా
నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో అడుగిడింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు
విజయమ్మ, షర్మిలకు ఘనంగా స్వాగతం పలికారు.తెలంగాణ
ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు దివంగత వైఎస్
చిరకాల స్వప్నాల్లో ఒకటని,ఆయన మరణించాక ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే
ఆగిపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. మానవపాడు మండలం
పుల్లూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ, షర్మిల మాట్లాడారు. తెలంగాణ
సాధన కోసం టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే..
వాళ్ల మనోభావాలను గౌరవించాలని చెప్పి ఉప ఎన్నికల్లో జగన్ ఆ ఆరు
స్థానాల్లో పోటీ పెట్టలేదు అన్నారు
‘‘తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన బిడ్డలకు నా సలాం.. నా పాదం
మోపిన పవిత్ర తెలంగాణ మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా.. ప్రతి తెలంగాణ ఇంటిని
జగనన్న సంతోషంగా ఉంచుతాడు. నా అక్కలకు చెల్లెలకు, తెలంగాణసోదరులకు ఒక్క
మాట చెప్తున్నా.. మీరు ప్రాణ త్యాగాలు చేసుకోవద్దు. మీ ప్రాణాలు
ఇవ్వకుండా.. అందరం కలిసి తెలంగాణను నిలబెట్టుకుందాం’’ అని షర్మిల తెలంగాణ
ప్రజలను కోరారు. ‘‘వైఎస్సార్‌కు తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఏ
పథకం ప్రారంభించినా తెలంగాణ నుంచే మొదలుపెట్టారు. జలయజ్ఞం, రూ.2 కిలో
బియ్యం, రుణ మాఫీ, ఉచిత విద్యుత్తు, అన్ని పథకాలను ఆయన తెలంగాణ నుంచే
ప్రారంభించారు.’ అని షర్మిల పేర్కొన్నారు.పార్టీ అంచనాలను మించి స్పందన లభించడంతో వై సి పీ నేతలు ఉత్సాహంతో వున్నారు.
No comments:
Post a Comment