Thursday 15 November 2012

కాంగ్రెస్, టీడీపీ ఒక్కటే

‘‘మాలాంటి వారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకోవడంలో అర్థం ఉంది. కానీ చంద్రబాబుకు పాదయాత్ర ఎందుకు? ఆయనకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయొచ్చు.. కానీ దించేయరట."ఆదోని పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభ లో షర్మిల మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకుంది.  ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ సర్కార్ ను  కూలదోయడం చాలా సులభం. ప్రతిరోజూ అడుగుతూనే ఉన్నాం.. నిలదీస్తూనే ఉన్నాం.కానీ టీడీపీ అవిశ్వాసం పెట్టదట! పేరుకు మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయడం లేదంటూ చంద్రబాబు తిడుతూనే అదే ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారారు..  ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయని ధ్వజమెత్తారు. కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదన్న మాట నిజమే అయితే.. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టి తన నిజాయతీని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని.. ఆయనకు తెలిసిందల్లా అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు రాజకీయాలు చేయడమేనని ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...