
పదోరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తన ముందు గోడు వెళ్లబోసుకున్న అనంతపురం జిల్లా రైతులకు షర్మిల భరోసానిచ్చారు. జ్వరం కారణంగా షర్మిల కాస్త అస్వస్థతకు గురయ్యారు. అయినా ఉదయం 10.30కు పాదయాత్రకు బయలుదేరారు. డన్నపల్లి క్రాస్ సమీపంలో చెన్నారెడ్డి అనే రైతు వేరుశనగ పంటను పరిశీలించారు. తాను పూర్తిగా నష్టపోయానని ఆ రైతు మొరపెట్టుకున్నారు. భార్య తాళిబొట్టును కూడా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చానని, ఐదెకరాల్లో 60 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేస్తే ఇప్పుడు పంటకు రూ. 15 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇంతకుముందు మండలం యూనిట్‌గా పంట బీమా అందేదని, ఇప్పుడు దాన్ని తీసేసి వాతావరణ ఆధారిత బీమా అని ఇస్తున్నాని చెప్పారు. దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘రాజన్న ఉన్నప్పుడు పరిహారం చెల్లించే ఉద్దేశం ఉంది కాబట్టే గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారు.
ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పరిహారం ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే ఇలా అనేక
ఆంక్షలు పెడుతున్నారు.. మన్ను తిని బతకాలని చెబుతోంది ఈ ప్రభుత్వం. జగనన్న
సీఎం అయితే రైతు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వస్తుంది..’’ అని చెప్పారు.
బడన్నపల్లి క్రాస్‌రోడ్డులో 11.15కు జిల్లాకు చెందిన పలువురు ముస్లిం
సోదరులు షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు రాగా వారికి షర్మిల బక్రీద్
శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బడన్నపల్లి స్థానికులంతా తమకు గ్రామాల్లో
నీళ్లు లేవని, కరెంటు ఉండడం లేదని వాపోయారు. అర్ధరాత్రి కరెంటు ఎప్పుడు
వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు పంట వద్దే పడుకోవాల్సి
వస్తోందని, ప్రాణాలకు కూడా భద్రత లేదని చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు
ఉండేదని, వర్షాలు బాగా పడేవని గుర్తుచేసుకున్నారు. అందుకు ‘‘రాజు మంచోడైతే
దేవుడు కూడా దీవిస్తాడు. రాజన్న ఉన్నప్పుడు మాట మీద నిలబడ్డాడు. అందుకే
అప్పుడు సుభిక్షంగా ఉంది..’’ అని షర్మిల వారితో పేర్కొన్నారు. రైతుల
అవసరాలు గుర్తించి ముందు చూపుతో రాజన్న కరెంటు కొనుగోలు చేసి సరఫరా
చేశారని, ఈ ప్రభుత్వానికి ముందు చూపులేదని విమర్శించారు.
స్థానికులు నీటి సమస్యను షర్మిలతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ... ‘‘వైఎస్ ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని
తీసుకురావడంతో ఆప్పుడు నీటి సమస్య లేదు. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా
వ్యవహరించడంతో ఇప్పుడు ఆ నీళ్లు రాక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో
దాదాపు 30 వేల బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రభుత్వం నిద్రపోతోంది.
ముఖ్యమంత్రికేం బాగానే ఉన్నారు. మూడు కిలోమీటర్లు పోయి ఆయన భార్య నీళ్లు
మోసుకొస్తే ఆ బాధ అర్థమయ్యేది. ఈ పాపం ఈ సర్కారుదే..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం
చేశారు. అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.15కు గరుడాపల్లి సమీపంలో భోజన
విరామానికి ఆగారు. జ్వరం కారణంగా విశ్రాంతి తీసుకుని తిరిగి సాయంత్రం 5
గంటలకు బయలుదేరారు. దారిలో వసంతపురం గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. రాత్రి
7 గంటలకు చిగిచెర్లకు చేరుకోగా స్థానికులు షర్మిలకు మంగళహారతులతో స్వాగతం
పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం
తుంగభద్ర నీటిని తీసుకురావడంలో విఫలమవడం వల్లే ఇక్కడ నీటి కష్టాలు వచ్చాయని
మండిపడ్డారు. అనంతరం రాత్రి 7.40కి చిగిచర్ల సమీపంలో ఏర్పాటుచేసిన
రాత్రిబస స్థలానికి చేరుకున్నారు
No comments:
Post a Comment