షర్మిల పాదయాత్రలో రోజూ లక్షలాది మంది
పాల్గొంటున్నారు. తనను కలిసే అందరితో
ఆమె ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అయితే రోజూ ఉదయాన్నే ఒక వ్యక్తిని
మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకుని పలుకరిస్తారామె! అతడి పేరు వెంకటయ్య.
మహబూబ్‌నగర్ జిల్లా వాసి. వికలాంగుడు అయినప్పటికీ ఒక్క కాలితో నడుస్తూ రోజూ
అతడు యాత్రలో పాల్గొంటున్నాడు. అది చూసి చలించిపోయిన షర్మిల రోజూ
‘గుడ్‌మార్నింగ్ వెంకటయ్యన్న’ అంటూ ఆప్యాయంగా అతడిని పలుకరిస్తున్నారు. ఈ
ఆత్మీయ పిలుపుతో వెంకటయ్య మరింత ఉత్సాహంగా యాత్రలో పాల్గొంటున్నారు.
‘‘షర్మిలమ్మే మా దేవత. ఆమెతోనే మా దసరా పండుగ. నేను ఒంటికాలితో నడుస్తున్నాబాధ లేదు. మా జగనన్న చెల్లెలు ప్రజల కోసం నడుస్తూ, వారి
కష్టాలను తెలుసుకుంటూ, వారిని ఓదారుస్తున్న తీరు చూసి రాజకీయ నాయకులు
సిగ్గుపడాలి. నాకు శక్తి ఉన్నంత వరకూ యాత్రలో షర్మిలమ్మతో నడుస్తా!’’ అని
చెబుతున్నాడు వెంకటయ్య. ఈయనలాగే షర్మిలతో పాటు ఇచ్ఛాపురం వరకూ చాలా మంది
పాదయాత్ర చేస్తున్నారు.
No comments:
Post a Comment