రైతులపై కేసులు పెట్టిన ఘనత బాబుది..
" వేరుశనగ రైతుల కష్టాలపై ఆవేదన చెందానని, ఈ
ప్రభుత్వ మొండి వైఖరికి , జగనన్నపై కుమ్మక్కు రాజకీయాలకు
నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి తనతోపాటు కదం తొక్కాల"ని షర్మిల
పిలుపునిచ్చారు. పాదయాత్ర రాత్రికి వేములకు చేరుకున్న సందర్భం గా అక్కడ
భారీ జన సమూహాన్ని ఉద్దేశించి
షర్మిల ప్రసంగించారు.
‘‘చంద్రబాబు సీఎం అయితే ఇక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భయపడుతున్నారు.
కరెంటు చార్జీలు పెంచొద్దంటే రైతులను కాల్చిచంపిన ఘనత బాబుది. రైతు
కుటుంబాలను పరామర్శించకుండా పోలీసులను పరామర్శించిన ఘనత ఆయనది. కరెంటు
చార్జీల వసూళ్ల పేరుతో కేసులు పెట్టి రైతులను జైలులో పెట్టిన చంద్రబాబు
ప్రభుత్వాన్ని గద్దె దింపినట్టుగానే.. ఇప్పుడు కరెంటు కూడా ఇవ్వకుండా
చార్జీలు భారీగా పెంచిన ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపాలి..’’ అని
పిలుపునిచ్చారు. వేముల సమీపంలో ఏర్పాటు చేసిన బస స్థలానికి రాత్రి 7.50కి
షర్మిల చేరుకున్నారు. రెండోరోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర
సాగింది.
వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రెండోరోజు కూడా పాదయాత్రలో
ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
మధ్యాహ్న విరామ సమయానికి కొద్దిగా ముందు పాదయాత్ర నుంచి పక్కకు వచ్చిన
విజయమ్మ.. తిరిగి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30 వరకు పాదయాత్రలో నడిచారు.
ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఆరోగ్యం
దెబ్బతింటుందని, కారులో రావాలని సూచించగా వేముల వరకు కారులో వచ్చారు. వేముల
బహిరంగ సభలో విజయమ్మ కూడా పాల్గొన్నారు.
No comments:
Post a Comment