కడప ఎంపీ,వై సి పీ అధ్యక్షుడు జగన్ సోదరి
షర్మిల కు పార్టీ లో కీలక పదవి ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.షర్మిల ఏ
హోదాలో పాదయాత్ర చేపడుతున్నారని విమర్శలు వస్తోన్న నేపధ్యం లో షర్మిల కు
పార్టీ కార్యవర్గంలో ఒక పదవి ఇస్తే బాగుంటుందని పార్టీ నేతలు
అభిప్రాయపడినట్టు సమాచారం.ఇప్పటికే పార్టీ కి జగన్ అధ్యక్షుడు కాగా
విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు.ఒకే కుటుంబం నుంచి మరొక వ్యక్తీ కి
పదవి ఇస్తే కుటుంబ పార్టీ అనే విమర్శలు కూడా రావచ్చు అని కొందరు నేతలు
విజయమ్మకి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ కోసం పెద్ద సాహసం
చేస్తోన్న షర్మిల కు పదవి ఇవ్వడమే సమంజసం అని మెజార్టీ నేతలు
సూచించినట్టు తెలుస్తోంది.ఈ విషయం జగన్ దృష్టికి తీసుకెళ్ళి అయన అనుమతి తో
18 న ఇడుపుల పాయ లో జరిగే బహిరంగ సభ లో పార్టీ లో షర్మిల హోదా ఏమిటో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదిలా వుంటే ఈ నెల 18 నుంచి ఇడుపుల పాయలో
ప్రారంభంకానున్న షర్మిల పాదయాత్ర మరికొన్ని జిల్లాలలో జరిగే అవకాశాలు
కన్పిస్తున్నాయి. తొలుత 14 జిల్లాలలో పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు
చేసినా... నేతలు , కార్యకర్తల ఒత్తిడితో 16 జిల్లాల్లో సాగేలా పాదయాత్ర రూట్ మ్యాప్‌లో
మార్పులు చోటు చేసుకున్నాయి.18 న ఇడుపుల పాయలో
ఉదయం పదకొండున్నర గంటలకు యాత్ర ప్రారంభం కాబోతుంది. అక్కడ నిర్వహించే
బహిరంగ సభ తర్వాత వేంపల్లి , వేముల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. తొలి
రోజు పాదయాత్రలో 14.5 కిలో మీటర్లు కొనసాగనుంది. యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు జిల్లా స్థాయిలలో
సమన్వయకమిటీలను , కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.యాత్రను
విజయవంతం చేసే అంశంపైనా ..యాత్ర స్వరూపం, పాదయాత్రకు
ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు , వసతి సౌకర్యాలు ,
సభలు నిర్వహించాల్సిన ప్రాంతాలపైనా ప్రధానంగా పార్టీ నేతలు దృష్టి సారించారు. నేతలు ,
కార్యకర్తలు ఎటువంటి ఆర్బాటాలకు పోకుండా యాత్రలో పాల్గొనాలని ...16
జిల్లాలోలో ఆరు నెలలపాటు షర్మిల ప్రజా ప్రస్థానం కొనసాగుతుందని ఎమ్మెల్యే
భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మొత్తం మీద షర్మిల పాదయాత్ర
ప్రకటన పార్టీ కేడర్లో నవ్యోత్సాహాన్ని నింపిందని నేతలు భావిస్తున్నారు
No comments:
Post a Comment