Monday 17 December 2012

షర్మిల యాత్రకు మరో రోజు విరామం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ సోదరి షర్మిల తన పాదయాత్రకు మరో రోజు విరామం ప్రకటించారు. ఆమె కుడికాలు మోచిప్పకైన గాయం నొప్పి తీవ్రం కావడంతో విశ్రాంతి తప్పనిసరి అని ఆర్థోపెడిక్ వైద్యులు సూచించారు. ఆదివారం ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ విద్యాసాగర్, సీఎస్ రెడ్డి, శివభారత్ రెడ్డి ఆమెను వేర్వేరుగా పరీక్షించారు. ఈ గాయాన్ని వైద్య పరిభాషలో లిగ్మెంట్ ఇంజురీ అంటారని సీఎస్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌లోని బస కేంద్రంలో ఉన్న షర్మిలను ఆదివారం దిల్‌సుఖ్‌నగర్ కోనార్క్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పరీక్షలు చేశారు. స్కానింగ్ రిపోర్టులు సోమవారం అందుతాయని వైద్యులు తెలిపారు. ఇందువల్ల  సోమవారం కూడా పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇదిలా ఉంటె
 900 కిలోమీటర్లకు పైగా షర్మిల పాదయాత్ర పూర్తి చేశారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్న షర్మిల పాదయాత్ర ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఆగింది .ఇడుపుల పాయ నుండి ఇచ్చాపురం వరకు మూడు వేల కిలోమీటర్లకుపైగా మహాపాదయాత్రను చేపడుతున్న షర్మిల 900 కిలోమీటర్లమేర పాదయాత్రను పూర్తి చేశారు .అలుపెరుగకుండా షర్మిల గత 60 రోజుల నుండి కడప , అనంతపురం , కర్నూలు ,మహబూబ్‌నగర్ జిల్లాలలో  విస్తృతంగా పాదయాత్ర చేసి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కు చేరుకున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు, మైనార్టీలు, రైతులు, విద్యార్థులతో పాటు వివిధ వర్గాల ప్రజలతో మమేకమై ఉత్సాహంగా సాగుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రాంతాలలో జరుగుతున్న బహిరంగ సభలలో షర్మిల పాల్గొంటున్నారు. ముఖ్యంగా మహిళలతో రచ్చబండలను నిర్వహిస్తున్న షర్మిల.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్యాస్‌ కష్టాలు ,విద్యుత్ సర్ చార్జీల పెంపు, తదితర అంశాలపై ప్రభుత్వవైఖరిని తూర్పారపడుతూ ఆమె ప్రసంగాలు సాగుతున్నాయి. అదే సమయం లో వైఎస్ హయాంలో జరిగిన మేలును కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు .దేశ చరిత్రలో ఏమహిళ చేపట్టని రీతిలో మూడు వేల కిలో మీటర్ల పాదయాత్రను షర్మిల  చేపట్టారు.  ఇప్పటికే 900 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర పూర్తి చేసిన ఆమె సగటున 14 నుండి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. మరో మూడు రోజులు రంగారెడ్డి జిల్లాలో పాదయాత్రపూర్తి చేసి నల్గొండ జిల్లాలో ప్రవేశించనున్నారు.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...